• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చర్యలు తీసుకుంటే ఊరుకోం: అధినేత చంద్రబాబుపై హరీశ్వర్ రెడ్డి ధ్వజం

By Srinivas
|

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు చిదంబరానికి లేఖ రాయాల్సిందేనని పార్టీపై, పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డికి మరోసారి బాసటగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ ఇటీవల ఏర్పాటు చేసిన తెలంగాణ టిడిపి ఫోరంపై ఆయన సోమవారం ప్రశ్నల వర్షం కురిపించారు. తాము ముప్పై ఏళ్లుగా పార్టీలు ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశామని అలాంటి తమపై నిన్నగాక మొన్న వచ్చిన వారు చర్యలు తీసుకుంటామనడం ఏమిటని టిడిపి యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. నాగంపై చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదన్నారు. పార్టీలో వైఖరి చూస్తుంటే ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములకే ప్రాధాన్యత అన్నట్లుగా ఉందని అన్నారు. నిన్నటి వరకు తెలంగాణ కోసం సొంత జెండా పెట్టుకుంటానని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఫోరం రాగానే పార్టీ జెండా అంటూ మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి దయాకరరావును ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకు తెలంగాణ సాధించుకునేందుకు అన్ని పార్టీలు తమ తమ బాధ్యతగా ఉద్యమిస్తున్నాయని అలాగే టిడిపి నుండి తాము ఉద్యమిస్తున్నామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం టిడిపి గతంలోనే తీర్మానం చేసిందని దాని ప్రకారమే తాము వెళ్తున్నామన్నారు. తాము ఎప్పుడూ పార్టీ అధినేతను, పార్టీని విమర్శించలేదన్నారు.

ప్రణబ్‌కు లేఖ ఇచ్చిన మాదిరిగానే చిదంబరానికి కూడా చంద్రబాబు లేఖ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తమ ఢిల్లీ పర్యటనలో చిదంబరం లేఖ ఇచ్చిన సమయంలో పార్టీ తరఫునా ఫోరం తరఫునా అని ప్రశ్నించారని అన్నారు. చిదంబరానికి బాబు లేఖ రాస్తేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారన్నారు. చంద్రబాబు కూడా అసెంబ్లీలో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. పార్లమెంటులో కూడా ఎంపీలు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణలో పార్టీ బలపడేందుకే తాము తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నామని చెప్పారు. తెలంగాణపై టిడిపి ఒక్కసారి స్పష్టత ఇస్తే ప్రజలు నమ్ముతారన్నారు. ఇటీవల పెట్టిన ఫోరం తెలంగాణ సాధన కోసమా లేక తమపై చర్యలు తీసుకోవడానికా అని ప్రశ్నించారు.

టిడిపి తెలంగాణ ఇచ్చేది కాదు, తెచ్చేది కాదన్నారు. కాబట్టి ఒక్కసారి ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే చాలన్నారు. తమ ముందు పార్టీలోకి వచ్చిన వారు కొందరు తమపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినందువల్లే తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఇటీవల ఏర్పడిన ఫోరానికి తమపై చర్యలు తీసుకునే అర్హత లేదన్నారు. తమపై చర్యలు తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. పార్టీ మనుగడకు ఇబ్బంది లేకుండా తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఆయనపై ఫోరంపై సంధించిన ప్రశ్నలు... చంద్రబాబు చెబుతున్న రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు ఎవరైనా నమ్ముతున్నారనా అని ప్రశ్నించారు. పోరం ఏర్పాటు సీమాంధ్ర నాయకుల రక్షించి తెలంగాణ వాదుల్ని కట్టడి చేయడానికా అని అన్నారు. విగ్రహాలు పునప్రతిష్టించాలనే టిడిపి డిమాండ్‌కు తెలంగాణ ప్రజల మద్దతు ఉందా అని ప్రశ్నించారు. టిడిపి ఎస్సార్సీకి ఒప్పుకుంటే ఫోరం వైఖరి ఎలా ఉంటుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో గట్టి పట్టు ఉన్న పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రజాగ్రహానికి గురైందా లేదా అని ప్రశ్నించారు. చిదంబరానికి లేఖ రాయాల్సిన అవసరం లేదని అనడంలో ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.

English summary
TDP MLA Harishwar Reddy fired at party president Chandrababu Naidu today. He blamed Revanth Reddy and Errabelli Dayakar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X