టిడిపి ఎమ్మెల్యేల కాన్వాయ్‌ని అడ్డుకున్న తరాస కార్యకర్తలు, నాయకులు

తెరాస నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత తెలుగుదేశం శాసనసభ్యులను పంపించారు. కాగా, కరీంనగర్‌లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సభను అడ్డుకోవడానికి తెరాస కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. తెరాస నాయకులు నారదాసు లక్ష్మణ రావు, కొప్పుల ఈశ్వర్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లో తెలుగుదేశం తెలంగాణ రణభేరీ బహిరంగ సభ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.












Click it and Unblock the Notifications