17 మంది ఐపియస్ అధికారుల బదిలీ, 11 జిల్లాలకు కొత్త ఎస్పీలు

ఎన్. శివశంకర్‌రెడ్డిని నల్గొండ జిల్లా ఎస్పిగా, డాక్టర్ వి. రవిందర్‌ను కరీంనగర్ జిల్లా ఎస్పీగా, జె. ప్రభాకర్ రావును తిరుపతి అర్బన్ ఎస్పీగా, పి.జాన్ విక్టర్‌ను మెదక్ ఎస్పీగా, బి. రమణకుమార్‌ను నెల్లూరు ఎస్పీగా, కాంతి రాణా టాటాను చిత్తూరు జిల్లా ఎస్పీగా, పి.హరికుమార్‌ను ఖమ్మం ఎస్పీగా నియమించారు. ఎస్. రాజేశ్‌కుమార్‌ను వరంగల్ రూరల్ ఎస్పీగా, జి. శ్రీనివాసన్‌ను విశాఖ రూరల్ ఎస్పీగా, సి.ఎం. త్రివిక్రమ్ వర్మను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నియమించారు.
ఎ. సురేందర్‌కుమార్ దాస్‌ను సీఐడీ ఎస్పీగా నియమించారు. ఇ. దామోదర్‌ను సీఐడీ ఎస్పీగా నియమించారు. కె. రఘురామ్‌రెడ్డిని టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీగా, ఎస్. శ్యామ్‌సుందర్‌ను సికింద్రాబాద్ రైల్వేఎస్పీగా, ఎం. శివప్రసాద్‌ను కర్నూల్ ఎస్పీగా, పి.వి.ఎస్. రామకృష్ణను కృష్ణా జిల్లా ఓఎస్‌డీగా, కార్తీకేయను నర్శీపట్నం ఓఎస్‌డీగా నియమించారు.












Click it and Unblock the Notifications