వైయస్సార్‌పై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు, పాడిన పాటే మళ్లీ

Chandrababu Naidu
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై పాలనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోశారు. ఆయన శుక్రవారం మహానాడులో ప్రారంభోపన్యాసం చేశారు. తమదే గొప్ప అని చెప్పుకున్నారు. ఎప్పుడూ చేస్తున్న ప్రసంగాన్నే ఆయన మహానాడులో మరోసారి వినిపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైయస్ రాజశేఖర రెడ్డి నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు. సెజ్‌లో కోసం రైతుల భూములను లాక్కున్నారని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారని, భూగర్భ వనరులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకున్నా అవి సక్రమంగా అమలు కాలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెసు పాలన శాపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను వైయస్ రాజశేఖర రెడ్డి మభ్య పెట్టారని ఆయన అన్నారు.

తమ తొమ్మిదేళ్ల పాలనలో తీసుకున్న చర్యల వల్ల ప్రజల ఆదాయం పెరిగిందని, విద్యార్థులు ఘనమైన ఫలితాలు సాధిస్తున్నారని ఆయన చెప్పారు. తాము సుస్థిర పాలన అందించామని ఆయన అన్నారు. ఇప్పుడు మూడో ముఖ్యమంత్రి వచ్చారని ఆయన అన్నారు. సుపరిపాలన, సుస్థిర పాలన అందించిన ఘనత తమ పార్టీది మాత్రమేనని ఆయన అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడం చేతకాని ముఖ్యమంత్రి వల్ల కావడం లేదని ఆయన అన్నారు. పెట్రోల్ ధరలు పెంచారని, డిజీల్, కిరోసిన్ ధరలు పెంచుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు చేయలేకపోతోందని ఆయన విమర్శించారు.

ధరలు తగ్గించలేకపోతే కాంగ్రెసు ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజుల రీయంబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని, ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పారని ఆయన అన్నారు. జాతీయ రాజకీయాల్లో తమ పార్టీకి ప్రత్యేకత ఉందని ఆయన చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా తమ పార్టీ దీటుగా ఎదుర్కుందని ఆయన చెప్పారు. అవసరమైతే పోరాటాలు చేసైనా వెనకబడిన వర్గాలను కాపాడుకుంటామని ఆయన చెప్పారు. అవినీతిపై తమ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని ఆయన అన్నారు. వివిధ వృత్తికులాలు ఎదుర్కుంటున్న సమస్యలను ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+