మహానాడుకు హరికృష్ణ హాజరు, స్వర్గీయ ఎన్టీఆర్‌కు నివాళి

Harikrishna
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో ప్రారంభమైన తెలుగుదేశం 30వ మహానాడుకు రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ శుక్రవారం హాజరయ్యారు. బావ, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో తీవ్ర విభేదాలు ఉన్నట్లు చెబుతున్న హరికృష్ణ మహానాడుకు హాజరు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. మహానాడును చంద్రబాబు నాయుడు జ్యోతిప్రజ్వలనం చేసి ప్రారంభించారు. చంద్రబాబుతో పాటు హరికృష్ణ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

మహానాడు ప్రారంభమైన వెంటనే పార్టీ కార్యదర్శి పి.చంద్రశేఖర్ కార్యదర్శి నివేదికను మహానాడులో ప్రవేశపెట్టారు. రైతాంగ సమస్యలపై, ప్రజా సమస్యలపై పార్టీ చేసిన పోరాటాలను ఆయన వివరించారు. రైతు సమస్యలపై చంద్రబాబు చేసిన నిరాహారదీక్షను ఆయన ప్రస్తావించారు. వివిధ పార్టీల జాతీయ నాయకులు చంద్రబాబు చేత దీక్ష విరమింపజేశారని ఆయన చెప్పారు. చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+