నీ బలమెంతో గవర్నర్ వద్దకు వెళ్లి చెప్పు: వైయస్ జగన్‌కు సోమిరెడ్డి సవాల్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: నీ బలమెంతో రాజభవన్‌కు వెళ్లి గవర్నర్‌కు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు సవాల్ విసిరారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనను విమర్శిస్తూ వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు మద్దతిస్తున్నారని ఆయన అడిగారు. తన మద్దతుదారులతో వైయస్ జగన్ గవర్నర్‌కు లేఖ ఇవ్వాలని, అప్పుడు గవర్నర్ ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశిస్తారని, తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపరీక్షలో ఓటు వేస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
వచ్చే శాసనసభా సమావేశాల్లో తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు రాజకీయ పరిపక్వత లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో జగన్ చాలా చిన్నవాడని ఆయన అన్నారు. తమ మద్దతుదారులతో గవర్నర్‌కు ఇవ్వడం చేతకాదని అనిపిస్తే తనకు చేత కాదని జగన్ చెప్పాలని ఆయన అన్నారు.