వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా మది: వైయస్ జగన్ కన్నా తెలంగాణతోనే ఎక్కువ చిక్కులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కన్నా తెలంగాణ సమస్యతోనే పార్టీకి ఎక్కువ చిక్కులు వచ్చి పడుతున్నట్లు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ సమస్యను మరింత కాలం నాన్చితే పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి మరింత సమయం ఉందని, అయితే తెలంగాణ సమస్యను తక్షణం పరిష్కరించకపోతే కష్టాలు తప్పవని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దడంతో తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని కూడా కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది.

ప్రస్తుతానికి ముఖ్యమంత్రిని మార్చకూడదనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చింది. మళ్లీ ముఖ్యమంత్రిని మారిస్తే పలుచనవుతామనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చకుండా అసమ్మతిని తగ్గించాలనే వ్యూహంతో కాంగ్రెసు అధిష్టానం పనిచేస్తోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కొద్ది రోజులుగా తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. సోనియా గాంధీతో కూడా ఆయన చర్చించారు. ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పోస్టుల భర్తీతో పాటు పిసిసి అధ్యక్షుడి నియామకం కూడా జరపడానికి అధిష్టానం సమాయత్తమైంది. ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని ఆలోచిస్తోంది.

పిసిసి అధ్యక్ష పదవికి బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ, శ్రీధర్ బాబు, సంభాని చంద్రశేఖర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణను ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారు. మిగతా ముగ్గురిలో ఎవరైనా ఆయన అంగీకరించే అవకాశాలున్నాయి. మొత్తం ప్రక్రియ జూన్ 5,6 తేదీలకు ఓ కొలిక్కి రావచ్చునని అంటున్నారు.

English summary
It is learnt that Congress president Sonia Gandhi is thinking that Telangana issue is more dangerous than YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X