వైయస్ జగన్ గెలుస్తారని చంద్రబాబు భయపడుతున్నారు: అంబటి

తమకు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని, సాంకేతికంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం తమకు సాధ్యం కాదని, అందుకే ప్రధాన ప్రతిపక్షాన్ని అడుగుతున్నామని ఆయన అన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఆ కుట్రలో చంద్రబాబు పాలు పంచుకుంటున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిశారని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని నిరూపిస్తామని ఆయన అన్నారు. జగన్ వెంట ఉన్న శానససభ్యులు ఎప్పుడు, ఎలా బయటకు రావాలనేది తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయని, సమయమూ సందర్భాలను బట్టి వ్యూహాలు అమలవుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications