వ్యక్తిగత సంబంధాల వల్లనే వైయస్ ‌జగన్‌ను కలిశా: ఎమ్మెల్యే సికె బాబు

 CK Babu
చిత్తూరు: వ్యక్తిగత సంబంధాల వల్లనే తాను రెండు సార్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిసినట్లు చిత్తూరు జిల్లా మదనపల్లి కాంగ్రెసు శాసనసభ్యుడు సికె బాబు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సంబంధాల వల్ల తాను వైయస్ జగన్ దీక్షలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఆయన శనివారం చిత్తూరు జిల్లా నగిరిపల్లిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామా చేయకపోవడం అనైతికమని ఆయన అన్నారు.

తాను కాంగ్రెసువాదినేని సికె బాబు అన్నారు. తాను గ్రూపు రాజకీయాలకు దూరమని ఆయన చెప్పారు. తన నియోజకవర్గం అభివృద్ధి తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన అన్నారు. గ్రూపు రాజకీయాలకు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధం లేదని మరో ఎమ్మెల్యే షాజహాన్ అన్నారు. షాజహాన్ కూడా శనివారం ముఖ్యమంత్రిని కలిశారు.

జిల్లాలవారీగా అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును సమీక్షిస్తామని, సమీక్ష తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ఉదయం నగిరిపల్లిలోని తన ఇంటికి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+