వైయస్ జగన్ జైలు ఊచలు లెక్కిస్తారు: ఎంపి నామా నాగేశ్వర రావు

అధికారంలో ఉండి వైయస్ జగన్, అధికారంలో లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఓ చానెల్, ఓ పత్రిక పెట్టడానికి కెసిఆర్ ఏం వ్యాపారం చేసి సంపాదించాడని ఆయన అడిగారు. కాంగ్రెసుతోనే అవినీతి పుట్టి పెరిగిందని ఆయన అన్నారు. కుంభకోణాలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో, కేంద్రంలో అవినీతి పేరుకుపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications