సిగ్గు లేకుండా చంద్రబాబు కుమ్మక్కై మమ్మల్ని అంటున్నారు: వైయస్ జగన్

సంక్షేమ పథకాలను పట్టించుకోని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతారని పేదవాళ్లు, రైతు సోదరులు ఆశగా ప్రతిపక్షంవైపు వేయికళ్లతో ఎదురుచూస్తుంటే చంద్రబాబు నాయుడు చేతగాని దద్దమ్మలాగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వానికి వారం రోజులు గడువిచ్చి అవిశ్వాసం పెట్టి గట్టిగా దండించాల్సిందిపోయిఅధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చేతగాని ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి సువర్ణ యుగం సాగుతున్న రోజుల్లో 46 మంది ఎమ్మెల్యేలతోనే అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు ఆ వేళ ఏ లెక్కలు చూసుకొని పెట్టారని, ఈ రోజు 90 మంది ఎమ్మెల్యేలున్నా ఎందుకు మాట్లాడ్డం లేదని ఆయన అడిగారు.
ఈ రోజు మద్దతు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారని, వారికి మద్దతు ధర దక్కేలా చేయడానికి రూ. 2 వేల కోట్లు అవసరమని, వాటిని కేటాయించాలంటూ ప్రభుత్వానికి చంద్రబాబు అవిశ్వాసం నోటీసివ్వాలని కేటాయించకపోతే అవిశ్వాసం పెట్టాలని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ. 6,800 కోట్లూ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆయన చంద్రబాబును అడిగారు. చంద్రబాబు 90 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా చేతగాని దద్దమ్మలా కూర్చుని తమను అవిశ్వాసం పెట్టాలని అడగడం మీకు సిగ్గుగా లేదా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications