హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ వివేకానంద రెడ్డికి కాంగ్రెసు అధిష్టానం మొండిచేయి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
హైదరాబాద్: పులివెందుల శానససభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వైయస్ వివేకానంద రెడ్డికి కాంగ్రెసు అధిష్టానం మొండిచేయి చూపింది. గవర్నర్ కోటా కింద ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. వ్యవసాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసిన వైయస్ వివేకానంద రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారని భావించారు. అయితే, వైయస్ వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం లేదని తేలిపోయింది. గవర్నర్ కోటా కింద శాసన మండలికి కాంగ్రెసు అధిష్టానం ఐదుగురు పేర్లను ఖరారు చేసింది.

చక్రపాణి, అఫ్సరుద్దీన్, రెడ్డప్పరెడ్డి, ఎం. రాజేశ్వర రావు, నాగలక్ష్మీదేవి పేర్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది. అయితే ఈ జాబితాను కాంగ్రెసు అధికారికంగా ప్రకటించలేదు. అయితే, తాను ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి పదవి చేపట్టబోనని వైయస్ వివేకానంద రెడ్డి పులివెందులకు పోటీ చేసే సమయంలో ప్రకటించారు. ఇటీవల ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. వైయస్ వివేకానంద రెడ్డి తన మాటను వెనక్కి తీసుకోకపోవడం వల్లనే ఎమ్మెల్సీగా ఎంపిక చేయలేదా అనే విషయం తేలాల్సి ఉంది.

English summary
YS Vivekanda Reddy's name is not in the MLC candidares list to be elected from Governor quota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X