హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిసిసి రేసులో పొన్నాల లక్ష్మయ్య, ఎజెండాలో మంత్రి వర్గ ప్రక్షాళన?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: స్పీకర్ ఎన్నికతో పార్టీ పరిస్థితిని, ప్రభుత్వ తీరును మార్చడానికి కాంగ్రెసు అధిష్టానం పూనుకున్నట్లు చెప్పవచ్చు. ఈ నెల 4వ తేదీన శాసనసభ స్పీకర్ ఎన్నికతో మార్పులకు, చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. వారంలోగా ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్ష పదవికి తాజాగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. బొత్స సత్యనారాయణ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు పేరును కూడా కాంగ్రెసు పార్టీ అధిష్టానం పరిశీలించినట్లు చెబుతున్నారు.

శాసనసభ స్పీకర్‌గా నాదెండ్ల పేరు ఖరారైనట్లే. ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక కోసం శాసనసభ సమావేశమవుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవికి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్న మల్లుభట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశాలున్నాయి. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ ప్రక్షాళనకు కూడా శ్రీకారం చుడుతున్నారు. దామోదరం రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

English summary
It is said that Ponnala Laxmaiah may be appointed as PCC president. Minister Botsa Satyanarayana name is also in consideration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X