గవర్నర్ పదవి గురించి నాకు తెలియదు: మాజీ సిం రోశయ్య
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తనకు గవర్నర్ పదవి వస్తుందనే విషయంపై తనకు ఏమీ తెలియదని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గురువారం స్పష్టం చేశారు. తనకు గవర్నర్ పదవి వస్తుందని మీడియానే కథనాలు ప్రచురిస్తుందని అన్నారు. తన రెండు రోజుల న్యూఢిల్లీ పర్యనటలో అధిష్టానం తనకు చెప్పిన విషయాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లానని అన్నారు. కిరణ్ కుమార్ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని ప్రత్యేకంగా ఏమీ కలవలేదన్నారు.
కిరణ్‌తో తాజా రాజకీయాలపై తాము చర్చించామన్నారు. పార్టీ, ప్రభుత్వ పరమైన విషయాలపై చర్చించామని అన్నారు. తాను చివరి వరకు కాంగ్రెసు పార్టీ బలోపేతానికే కృషి చేస్తానని చెప్పారు. పార్టీలో అందరూ కూడా బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
Former chief minister Konijeti Rosaiah said that he did not know about governor post. He said he talked with CM Kiran Kumar Reddy about party and government.
Story first published: Thursday, June 2, 2011, 14:07 [IST]