NEET UG Admit Card 2026: నీట్ అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ కావట్లేదా ? NTA టిప్స్ ఇవే..!
ఈ ఏడాది నీట్ యూజీ పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్టీఏ) అడ్మిట్ కార్డుల్ని (NEET UG Admit Card 2026 ) నిన్న విడుదల చేసింది. అయితే ఈ అడ్మిట్ కార్డులు చాలా మందికి డౌన్ లోడ్ కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. వివిధ సాంకేతిక కారణాలతో ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ నీట్ యూజీ పరీక్ష అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ కోసం పలు టిప్స్ విడుదల చేసింది.
తమ నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్న విద్యార్థుల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని టిప్స్ ఇచ్చింది. ఏప్రిల్ 26న హాల్ టిక్కెట్లు విడుదలైన ఇంకా డౌన్ లోడ్ కాకపోవడానికి సర్వర్ సంబంధిత సమస్యలే కారణంగా తెలుస్తోంది. అయితే ఎన్టీఏ తమ తాజా అప్‌డేట్‌లో, నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ ప్రాముఖ్యతను, దానిని పొందడానికి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అంగీకరించింది. వెబ్‌సైట్‌పై అధిక ట్రాఫిక్ కారణంగా తాత్కాలిక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిపింది.

ఇప్పటికే నీట్ యూజీ పరీక్షకు మొత్తం 22.79 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 11 లక్షలకు పైగా విద్యార్థులు ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మిగిలిన వారు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం ఎన్టీఏ ఇలా ట్రై చేయమని సూచిస్తోంది.
1. బ్రౌజర్ కాష్, కుకీలను క్లియర్ చేయాలి
2. ఇన్‌కాగ్నిటో/ప్రైవేట్ మోడ్‌లో డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించాలి.
3. వేరొక బ్రౌజర్‌ను ఉపయోగించండి (క్రోమ్ లేదా ఫైర్‌ఫాక్స్ సిఫార్సు చేసింది)
4. స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగించి కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించాలి
ఇంకా సమస్యలు కొనసాగుతున్న విద్యార్థులు 011-40759000 లేదా 011-69227700 నంబర్లలో NTA హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని లేదా వారి అప్లికేషన్ నంబర్‌తో ఏజెన్సీకి ఫిర్యాదు చేయాలని ఎన్టీఏ సూచించింది.














Click it and Unblock the Notifications