స్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ పోటీ, అభ్యర్థిగా కెఇ కృష్ణమూర్తి?

కాగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చంద్రబాబుతో భేటీ అనంతరం నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ టిడిఎల్పీ కార్యాలయంలో వారు మరోసారి సమావేశమయ్యారు. అనంతరం వారు శాసనసభా కార్యదర్శి సదారాంను కలిసి అసెంబ్లీ అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరారు. డిప్యూటీ స్పీకర్‌కు అవిశ్వాసం నోటీసు ఇవ్వాలని వెళ్లినప్పటికీ ముందు అపాయింట్‌మెంట్ తీసుకోనందున ఆయన అందుబాటులో లేరు. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన అనంతరం టిడిపి ఎమ్మెల్యేలు మీడియా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయిందని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలం అయినందునే తాము రైతాంగ సమస్యలపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేరని చెప్పారు. అవిశ్వాసంపై తమతో కలిసి వచ్చే వారు రావచ్చని సూచించారు.












Click it and Unblock the Notifications