వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి మంత్రులను శిక్షించాల్సిందే: యోగా గురు రామ్‌దేవ్ బాబా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
న్యూఢిల్లీ: అవినీతి, అక్రమాలు, నల్లడబ్బు వెనక్కి తెప్పించే పోరాటంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ శుక్రవారం రామ్‌లీలా మైదానంలో తన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. విదేశా బ్యాంకుల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెప్పించాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తన దీక్షను విరమింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో దీక్షను విరమించేది లేదన్నారు. సత్యాగ్రహ దీక్షను తప్పకుండా చేపడతానని చెప్పారు. తన డిమాండ్లు నెరవేరే వరకు దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

అవినీతిపరులైన రాజకీయ నాయకులను, మంత్రులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తన దీక్ష ఓ వర్గానికి చెందినదో లేక రాజకీయ ప్రేరేపితమో కాదన్నారు. ఈ సందర్భంగా బాబా తన దీక్ష గురించి తన మద్దతుదారులకు వివరించారు.

English summary
Yoga guru Baba Ramdev was confirmed that he will not stop sathyagraha deeksha. He said he do his deeksha till government accepts his demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X