మళ్లీ త్రిషతో కలిసి కనిపించిన విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. మరోసారి త్రిషతో కలిసి కనిపించారు. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విజయ్.. త్రిషతో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ, సినీవర్గాల్లో చర్చకు దారితీసింది. విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో వారిద్దరూ కలిసి కనిపించారు. ఈ కార్యక్రమానికి ఆమె గెస్ట్ గా హాజరయ్యారు.
ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనను పరామర్శించడానికి విజయ్, త్రిష కలిసి వెళ్లారు. ఒకే కారులో ట్రావెల్ చేసినట్లు చెబుతున్నారు. మోహిని మణి వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 8.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో అజిత్ దుబాయ్‌లో ఉన్నారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన చెన్నై చేరుకున్నారు.

తల్లిని కోల్పోయిన అజిత్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. ఈ క్రమంలో రాత్రి విజయ్ కూడా చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని అజిత్ ఇంటికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. మోహిని మణి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆ సమయంలో త్రిష ఆయన వెంటే ఉన్నారు. త్రిష కూడా అజిత్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
#WATCH | Chennai: Tamil Nadu CM C. Joseph Vijay visited the residence of actor Ajith Kumar and conveyed condolences on the demise of the actor's mother. (30.05)
— ANI (@ANI) May 31, 2026
(Source: Tamil Nadu DIPR) pic.twitter.com/7cbSLWxEz5
కొన్నేళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ పెయిర్ గా కొనసాగుతున్న విజయ్-త్రిష.. ఇప్పుడు రాజకీయ, వ్యక్తిగత కార్యక్రమాల్లోనూ కలిసి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఘిల్లి నుండి లియో వరకు విజయ్‌తో కలిసి పలు సినిమాల్లో నటించారు త్రిష. అటు అజిత్‌తోనూ మన్‌కథా, 'కిరీడం' వంటి చిత్రాలలో నటించారు. అజిత్, ఆయన కుటుంబంతోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications