వైయస్ విజయమ్మ ప్రమాణ స్వీకారం: 13మంది ఎమ్మెల్యేలు హాజరు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: పులివెందుల నియోజకవర్గం నుండి ఇటీవల ఉప ఎన్నికలలో గెలుపొందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ విజయమ్మ శుక్రవారం శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకరు జెసి దివాకర్ రెడ్డి విజయమ్మచే ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా విజయమ్మ ప్రమాణ స్వీకారానికి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవంలో 13 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పాల్గొన్నారు.
శాసనసభ్యులు జయసుధ, కొండా సురేఖ, అమరనాత్ రెడ్డి, శ్రీనివాసులు, కొర్ల భారతి, ధర్మాన కృష్ణదాసు, ఆదినారాయణరెడ్డి, బాబురావు, శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. కాగా అంతకుముందు ప్రొటెం స్పీకర్ జెసి దివాకర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ తిరస్కరించి తన సొంత వాహనంలో అసెంబ్లీకి వచ్చారు. ఆయన రెండో గేటు గుండా అసెంబ్లీ లోనికి వచ్చారు.