ప్రస్తావనకు రాని అవిశ్వాస తీర్మానం నోటీసు, టిడిపి ఎమ్మెల్యేల ఆందోళన

Telugudesam
హైదరాబాద్: రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ ఇచ్చిన నోటీసుపై శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రస్తావించలేదు. ఆ నోటీసు ప్రస్తావన లేకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో తెలుగుదేశం శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా వారు శనివారం స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ఆ తర్వాత పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో తమ నేత చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. స్పీకర్ తీరను ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. స్పీకర్ చర్యను అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు.

తమ నోటీసును స్పీకర్ ప్రస్తావించకపోవడాన్ని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తప్పు పట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందనేది తేలిపోయిందని ఆయన అన్నారు. అధికారంలో కొనసాగే ఆర్హతను కోల్పోయిందని ఆయన అన్నారు. తమ నోటీసుపై ఏ విధంగా పోవాలనే విషయంపై మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. స్పీకర్‌పై పోరాటం చేయాలా, ప్రభుత్వంపై ఉద్యమించాలా, గవర్నర్‌పై ఒత్తిడి తేవాలా అనే విషయాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. నేటి ఎజెండా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మాత్రమేనని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+