బాబా రామ్‌దేవ్ హైదరాబాద్ వస్తున్నాడనే వార్తలు: అర్థరాత్రి కలకలం

Baba Ramdev
హైదరాబాద్: నల్లధనం వెనక్కి తెప్పించి జాతీయ సంపదగా ప్రకటించాలనే ప్రధాన డిమాండుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్షకు దిగిన ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేసి హైదరాబాదుకు తరలిస్తున్నారనే వార్తలు అర్ధరాత్రి రావడంతో హైదరాబాదులో కొంత కలకలం చెలరేగింది. శనివారం అర్దరాత్రి అమానుషంగా దీక్షా శిబిరం చేరుకున్న పోలీసులు బాబాను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ఢిల్లీ నుండి హైదరాబాదుకు తరలిస్తున్నారనే వార్తలు వచ్చాయి. కేంద్రం నుండి రాష్ట్ర అధికారులకు ఈ సూచనలు అందినట్టుగా తెలుస్తోంది.

దీంతో రాష్ట్ర పోలీసుల యంత్రాంగం అప్రమత్తమయింది. శంషాబాద్ విమానాశ్రయంలో అదనపు డిజిపి స్థాయి అధికారితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబాను ఏ క్షణంలో ఇక్కడకు తీసుకు వచ్చినా అప్రమత్తంగా ఉండేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలీసులు ఉదయం వరకు బందోబస్తు చేశారు. అయితే ఆదివారం ఉదయం సమయంలో బాబా రావడం లేదని తెలిసి బందోబస్తును విరమించుకున్నారు. కాగా బాబాను ప్రత్యేక హెలికాప్టర్‌లో సఫ్దర్ జంగ్ విమానాశ్రయం నుండి హరిద్వార్ తీసుకు వెళ్లినట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+