జగన్‌వి ప్రగల్భాలే, ఆయన రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు: ఆనం

Anam Vivekananda Reddy
నెల్లూరు: ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వాన్ని పడగొడతానని, స్పీకర్ పదవికి కాంగ్రెసు వారికి ఓటు వేయమని ప్రగల్బాలు పలికిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు కాంగ్రెసు అభ్యర్థికి ఓటు వేశారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి సోమవారం అన్నారు. పదవులు పోతాయనే భయంతోనే వారు కాంగ్రెసు అభ్యర్థికి ఓటు వేశారని అన్నారు. వారివి కేవలం బెదిరింపు చర్యలు, పిల్ల చేష్టలు, కుప్పి గంతులు అని ఆయన విమర్శించారు. జగన్, ఆయన వర్గానివి కేవలం ప్రగల్బాలే అని స్పీకర్ ఎన్నిక సందర్భంగా తేటతెల్లం అయిందన్నారు. కాంగ్రెసు అభ్యర్థులకు ఓటు వేయమని వారిని ఎవరూ అర్థించలేదని కేవలం పదవులు ఎక్కడ కోల్పోతామో అన్న ఆందోళనతోనే వారంతట వారే ఓటు వేశారని అన్నారు.

స్పీకర్ ఎన్నికకు మెజార్టీ వచ్చినప్పుడు అవిశ్వాసం అవసరం లేదన్నారు. జగన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారనిఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎందులోనూ పోలిక లేదని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసమే ఆయన వర్గం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ది కలెక్షన్ల వ్యాపారం అని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+