సిఎం కిరణ్‌కు దమ్ముంటే మంత్రులను అరెస్టు చేయాలి: బిజెపి

భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రాందేవ్ బాబాకు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బాబా దీక్ష వెనుక ఆరెస్సెస్, బిజెపి ఉన్నాయనడంలో అర్థం లేదని బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నాయని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఎవరూ పోరాడినా బిజెపి మద్దతిస్తుందన్నారు. అన్నాహజారే, బాబాలవి ప్రజా ఉద్యమాలు అన్నారు. బాధ్యతగల ప్రతిపక్షంగా వారికి మేం మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. బాబాను క్రిమినల్ అని ఇప్పుడు చెబుతున్న కేంద్ర మంత్రులు మొదట విమానాశ్రయంలో ఎర్రతివాచి ఎందుకు పరిచారని ప్రశ్నించారు. కాగా ఈ దీక్షలో దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications