చిరు భవిష్యత్తు భద్రమన్న ఆజాద్, స్థాయి రాలేదన్న చిరంజీవి

కాంగ్రెసు అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే స్థాయి తనకు ఇంకా రాలేదని చిరంజీవి అన్నారు. ఆజాద్‌తో ప్రజారాజ్యం నేతలు రెండు గ్రూపులుగా సమావేశమయ్యారని, ఒక్కసారి సీనియర్ నాయకులనూ మరోసారి శానసశభ్యులను ఆజాద్‌కు పరిచయం చేశానని ఆయన అన్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి ప్రకటన రావాల్సి ఉందని, అందుకు పది పదిహేను రోజులు పట్టవచ్చునని ఆయన అన్నారు. విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత తమకు ఇచ్చే ప్రాముఖ్యం గురించి తెలుస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications