పారిస్‌లో ఇక నుండి ఫేస్‌బుక్, ట్విట్టర్ అనే పదాలు వినపడవోచ్చి..!!!

ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్, ప్రపంచంలో కెల్లా బాగా పాపులర్ అయినటువంటి మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ లాంటి పదాల గురించి ఎప్పుడైనా యాంకర్స్ ప్రస్తావించేటప్పుడు వాటి ఏదైనా విషయం వచ్చినప్పుడు మాత్రమే ప్రస్తావించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ప్రెంచ్ రెగ్యులేటర్ ఆఫ్ బ్రాడ్ క్యాస్టింగ్ కౌన్సిల్ సుపీరియర్ క్రిస్టియన్ కెల్లీ మాట్లాడుతూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం మీడియా వారు సోషల్ నెట్ వర్కింగ్, మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్స్ అనగానే కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్ గురించే ప్రస్తావించడంతో ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన వెబ్ సైట్స్ ఐడెంటెటీని కొల్పోవడం జరుగుతుంది. అందుకే ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నానని తెలిపారు.
ఫేస్‌బుక్‌కి మేము ప్రిపరెన్స్ ఇస్తాం. ఎందుకంటే అది బిలియన్ డాలర్స్ విలుగలది కాబట్టి. ఇది ఇలా ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ వాటి ఉనికి కోసం చాలా ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వాటికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ రెండు పదాలను న్యూస్ ఛానల్స్‌లో వాడడం తగ్గించమని కోరుతున్నాం. మేము కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్‌కే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తే మిగిలినటువంటి వారు మమ్మల్ని ఎందుకు నెగ్లెట్ చేస్తున్నారంటూ అడిగే అవకాశం ఉందన్నారు. సో దీనిని బట్టి మనకు అర్దం అయింది ఏమిటంటే రాబోయే కాలంలో ప్రెంచ్ టివి, రేడియా ప్రసార కార్యక్రమాలలో ఫేస్‌బుక్, ట్విట్టర్ అనే పదాలు ఇక మీదట వినపడవు అన్నమాట.