ఇలా ఐతే గూగుల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది: చైనా పీపుల్స్ డైలీ

అందులో ఉన్న కధనం ప్రకారం చైనా గవర్నమెంట్‌లో పని చేస్తున్నటువంటి కొంత మంది ఆఫీసియల్స్ జీమెయిల్స్ మీద కూడా హ్యాకింగ్ ఎటాక్స్ జరిగాయని అన్నారు. మేమే గనుక చేయింటి ఉంటే అలా ఎందుకు చేస్తామని ప్రస్తావించారు. గూగుల్ మాత్రం ఈ జీమెయిల్స్ హ్యాకింగ్ చైనా ప్రభుత్వమే దగ్గరుండి మరీ చేయిస్తుందని పనిగట్టుకోని మరీ అందరికి చెబుతుంది. ఇదంతా నిరాధారం అని చైనా పీపుల్స్ డైలీ ప్రచురించింది. గతంలో చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్‌తో జరిగిన సెన్సార్‌షిప్ ప్రాబ్లమ్స్ వల్ల సెర్చ్ ఇంజన్ గూగుల్ సర్వీస్‌ని అధికారంగా బయటకు పంపివేయడం జరిగింది.
తర్వాత స్పందించినటువంటి చైనా ప్రభుత్వం గూగుల్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలలో నిజం లేదని కొట్టిపారేసింది. అంతేకాకుండా జీమెయిల్ ఎటాక్స్ జరిగిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ దీనిపై విచారణ జరపడానికి యఫ్‌బిఐని కూడా ఆదేశించడం విశేషం.












Click it and Unblock the Notifications