దాశరథిని ఎన్టీ రామారావు అవమానించారు: తెలంగాణ మేధావి జయశంకర్

ట్యాంక్‌బండ్‌పై పెట్టిన విగ్రహాలను కూలుస్తామని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ శానససభలో మాట్లాడితే మీడియా దాన్ని ప్రసారం చేయలేదని ఆయన అన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల గుత్తాధిపత్యంలోని ప్రసార మాధ్యమాలు వాస్తలను మరుగున పడేయడమో, వక్రీకరించడమో చేస్తూ వస్తున్నాయని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కోస్తాంధ్రకు గోదావరి, కృష్ణానదుల నుంచి నీటి చుక్క రాదని మీడియా ప్రచారం చేస్తోందని, అయితే ఈ నదులు కాలు అడ్డం పెడితే ఆగేవి కావని, రాయలసీమ, కోస్తాంధ్రకు ఇవ్వాల్సిన వాటా ఇస్తూ తెలంగాణ న్యాయబద్దంగా దక్కాల్సిన వాటా అడుగుతున్నామని, ఈ విషయాన్ని తాము పదే పదే చెప్పినా మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదని, కావాలనే ఇటువంటి చర్యకు మీడియా పూనుకున్నదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఓ పత్రిక రావాలనే కోరిక, అవసరం ఉందని, అది నేడు తీరుతున్నదని ఆయన అన్నారు.