RCB కే కాదు, ఈ జట్లకూ కాసుల వర్షం - ఎవరికి ఎంతంటే..!!
IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్ కు మర్చిపోలేని మజాను అందించిన ఐపీఎల్ సంగ్రామం ముగిసింది. ఆర్సీబీ మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. ట్రోఫీని ముద్దాడటమే కాకుండా, ఆర్సీబీ జట్టు భారీగా ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ చివరి వరకు పోరాటం చేసింది. ఈ సారి ఐపీఎల్ లో బ్యాటర్లే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచారు. ధీటైన బౌలర్లు సైతం తేలిపోయారు. కాగా, గెలిచిన జట్టు.. రన్నరప్ జట్లే కాదు.. ఈ సారి సీజన్ లో ఈ జట్లకు కాసుల వర్షం కురిసింది.
ఐపీఎల్ లో ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ పైన కాసుల వర్షం కురిపించారు. ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు సాధించిన మూడో జట్టుగా చరిత్ర సృష్టించిన ఆర్సీబీకి బీసీసీఐ భారీ నజరానా అందించింది. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టు ఏకంగా రూ. 20 కోట్లు ప్రైజ్ మనీ రూపంలో కైవసం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచి తృటిలో కప్పు చేజార్చుకున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ. 12.5 కోట్ల నగదు బహుమతి లభించింది. కాగా, మరికొన్ని జట్లు కూడా కోట్ల రూపాయలను ఆర్జించాయి.

వైభవ్ కు స్పెషల్ రివార్డులు
కాాగా.. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఓటమిపాలై మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ. 7 కోట్ల భారీ నగదు లభించింది. అదేవిధంగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. ఇక ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) గెలుచుకున్న ఆటగాడికి 10 లక్షలు, పర్పుల్ క్యాప్ విజేతకు 10 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు 10లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన ఆటగాడికి 20లక్షలు అందజేసారు. వీటితో సూర్యవంశీ ఒక్క సారిగా అత్యధిక రివార్డులు గెలుచుకున్న ప్లేయర్ గా రికార్డు సాధించారు. మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లభించిన ప్రైజ్ మనీ 4.8 కోట్లు మాత్రమే. ఆ తర్వాత 2010లో దీనిని రూ. 10 కోట్లకు, 2014లో రూ. 15 కోట్లకు, 2018లో రూ. 20 కోట్లకు పెంచటంతో ఆర్సీబీకి పంట పండింది.













Click it and Unblock the Notifications