JEE Advanced 2026: 6 గంటలే చదివి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్-ఈసారి టాపర్ల వ్యూహాలివే..!

ప్రస్తుతం మన దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 (JEE Advanced) ఫలితాలు విడుదలయ్యాయి. శుభమ్ కుమార్ అఖిల భారత ర్యాంకు (AIR) 1 సాధించి సంచలనం సృష్టించాడు. ఈ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థుల విజయం వెనుక ఉన్న స్ఫూర్తిదాయక కథనాలు, వారి సన్నద్ధతా వ్యూహాలు, అధ్యయన దినచర్యలు, కుటుంబ మద్దతు, అలాగే భవిష్యత్తు ఐఐటీ ఆశావహుల కోసం వారు పంచుకున్న సలహాలను ఇప్పుడు చూద్దాం.

జేఈఈ అడ్వాన్సెడ్ ఫలితాలు (JEE Advanced Results)

ఐఐటీ కాన్పూర్ నిన్న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలను ప్రకటించింది. చాలామంది విద్యార్థుల నెలల, సంవత్సరాల ప్రిపరేషన్ దీంతో ముగిసినట్లయింది. ఈ ఏడాది 1,87,389 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు నమోదు చేసుకోగా, 1,79,694 మంది రెండు పేపర్‌లకు హాజరయ్యారు. వీరిలో 10,107 మంది బాలికలతో సహా మొత్తం 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో శుభమ్ కుమార్ 360 మార్కులకు 330 మార్కులతో AIR 1 సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాత కబీర్ ఛిల్లర్ 329/360 మార్కులతో AIR 2, జతిన్ చహర్ 319/360 మార్కులతో AIR 3 సాధించారు. ఈ మూడు ర్యాంకులను ఐఐటీ ఢిల్లీ జోన్‌ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. మహిళా అభ్యర్థులలో ఆరోహి 280 మార్కులతో 77వ ర్యాంక్ సాధించారు.

Forget 16-Hour Grind JEE Advanced AIR 1 Cracked It in Just 6 Hours a Day

6 గంటలు చదివి ఫస్ట్ ర్యాంక్

ఈ నలుగురు అభ్యర్ధుల్లో ఆలిండియా టాప్ ర్యాంకర్ శుభమ్ కుమార్.. తన అక్కను చూసి చదువుకోవడం నేర్చుకున్నట్లు తెలిపాడు. ఐఐటీ పట్నాలో బీటెక్ చేస్తున్న శుభమ్ అక్క, ఐఐటీ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన స్ఫూర్తి. జేఈఈ మెయిన్ 2026లో ర్యాంక్ వచ్చాక అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఒక సంభాషణలో శుభమ్ .. సన్నద్ధతా వ్యూహం రోజుకు ఎక్కువ గంటలు చదువుకోవడం కన్నా క్రమశిక్షణ, నిలకడపై ఆధారపడి ఉందన్నాడు. టాపర్లు రోజుకు 16 నుండి 18 గంటలు చదువుతారనే సాధారణ నమ్మకాన్ని తోసిపుచ్చాడు. రోజుకు సుమారు 6 గంటలు తరగతులలోనూ, మరో 6 గంటలు స్వయం అధ్యయనం కోసం కేటాయించాడు.

Forget 16-Hour Grind JEE Advanced AIR 1 Cracked It in Just 6 Hours a Day

విజేతల వ్యూహాలివే..

AIR 1 సాధించిన శుభమ్ కుమార్ కన్నా కేవలం ఒక్క మార్కు తక్కువతో కబీర్ ఛిల్లర్ AIR 2 సాధించారు. సాధారణంగా టాపర్లు రోజుకు 15 గంటలు చదువుకోవాలి, మరేమీ చేయకూడదు అని ప్రజలు అనుకునే ఒక మూస ధోరణి ఏర్పడిందని, అది నిజం కాదన్నాడు. తానెప్పుడూ అలా చేయలేదన్నాడు. బదులుగా కాన్పెప్ట్ లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నాడు. టాప్ 3 ర్యాంకర్ జతిన్ చహర్ సైతం ఉదయం 6 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజాము నుండి రాత్రి వరకు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపాడు. కోచింగ్ క్లాస్ లు ఉదయం 7 నుండి సాయంత్రం 2 గంటల వరకు సాగేవని, ఇంటికి తిరిగి వచ్చి కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు మళ్లీ చదువుకోవడం ప్రారంభించేవాడు. క్లాసులో బోధించిన నోట్స్‌ను రివిజన్ చేయడం. నేను షీట్లను, ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రయత్నించడమే తన విజయ రహస్యం. మహిళా టాపర్ ఆరోహి చాలా రిలాక్స్డ్ మైండ్‌తో పరీక్షకు వెళ్ళానని, చాలా మెరుగ్గా స్కోర్ చేశానని తెలిపింది. చాలా ముఖ్యమైన పరీక్ష అని మీరు ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిదని వెల్లడించింది. అలాగే నిద్ర మానుకుని చదవడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+