పోలీసు భద్రత కోరుతున్న మాజీ నక్సలైట్, తెరాస నేత కోనాపురి రాములు

తనకు భద్రత కల్పించాలని రాములు గత నెల 24వ తేదీన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులను కోరారు. తనను చంపుతామంటూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. తనకు వచ్చిన ఫోన్ కాల్స్ నెంబర్లను కూడా ఆయన పోలీసులకు ఇచ్చారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తామంటున్న పోలీసులు భద్రత కల్పించే విషయంపై మాత్రం మాట్లాడడం లేదు. రాములుకు భద్రత కల్పించాలని తెరాస నాయకులు కూడా సీనియర్ పోలీసు అధికారులను కోరారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కోనాపురి రాములు నక్సలైట్‌గా అజ్ఞాత జీవితం గడిపారు. రెండు సార్లు పోలీసులకు లొంగిపోయారు.












Click it and Unblock the Notifications