ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహ పేరు ఖరారు

కాగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం పార్టీని బలోపేతం చేసే దిశలో అడుగులు వేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలె సభాపతి, ఉప సభాపతి ఎన్నికలను పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిని బొత్స సత్యనారాయణను నియమించింది. ఆ తర్వాత ఇప్పుడ ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పూర్తి చేసింది. ఇక అధిష్టానం ముందు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసి తద్వారా రాష్ట్రంలో పార్టీని గాడిన పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications