హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు పరిష్కారం, సిఎంతో విభేదాలు లేవు: బొత్స సత్తిబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: రాష్ట్రంలో సున్నితమైన సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలకు అధిష్టానం పరిష్కారం చూపిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం పదవీ స్వీకారణోత్సవ కార్యక్రమంలో అన్నారు. తెలంగాణ అంశం చాలా సున్నతమైనదన్నారు. దానికి అధిష్టానం త్వరలో పరిష్కారం చూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల అభిప్రాయాలను తాను అధిష్టానానికి వివరిస్తానని చెప్పారు. ఈ విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. కార్యకర్తలు అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. కాంగ్రెసు పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని చెప్పారు.

మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కాంగ్రెసు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో సేవ చేశారన్నారు. కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. అధికారం ముఖ్యం కాదని ప్రజా సేవే ముఖ్యం అన్నారు. అధికారం లేకున్నా సేవ చేయవచ్చన్నారు. తనకు ముఖ్యమంత్రితో అభిప్రాయ బేధాలు లేవన్నారు. అందరం కలిసి ముందుకు వెళతామని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. పార్టీయే ప్రభుత్వానికి కళ్లు చెవులు అన్నారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్న అభిప్రాయం లేకుండా పని చేస్తాం అన్నారు. సీనియర్ల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. త్వరలో ప్రజల వద్దకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తాను కోవర్టునే అని అయితే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా పని చేసే కోవర్టునని చెప్పారు.

English summary
PCC President Botsa Satyanarayana hoped that Telangana issue will clear soon. He confirmed that he has no differences with CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X