టి-కాంగ్రెసుకు షాక్: ప్రాంతీయవాదం లేదంటూ జైపాల్ రెడ్డి సంచలనం!
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి శనివారం బొత్స సత్యనారాయణ పదవీ బాధ్యతల కార్యక్రమం సందర్భంగా సంచనల వ్యాఖ్యలు చేశారు. తాము ప్రాంతీయ వాదులమో, ఉప ప్రాంతీయ వాదులమో కామని మొదట తాము జాతీయ వాదులమని జైపాల్ రెడ్డి అన్నారు. తాము మొదట, చివర జాతీయ వాదులమని ఆ తర్వాతే ఏదైనా అన్నారు. అయితే ఆయన తాము ప్రాంతీయ వాదులమో, ఉప ప్రాంతీయ వాదులమో కాదని చెప్పడం ద్వారా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారా అనే కోణంలో కాంగ్రెసు నేతలు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు పలువురు తెలంగాణ వాదులకు కూడా రుచించనట్టుగానే కనిపిస్తోంది. అయితే తెలంగాణను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతంగా పని చేస్తున్నారని జైపాల్ రెడ్డి అన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయ పార్టీ లేదన్నారు. బిజెపి ఐదు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయిందన్నారు. అలాంటి పార్టీ కాంగ్రెసుకు ఎలా ప్రత్యామ్నాయం అవుతుందని ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ చొరవ, సమర్థత ఉన్న వ్యక్తి అన్నారు.