బయటకు వెళ్లిపోండి: జగన్ వర్గం ఎమ్మెల్యేలకు సిఎం హెచ్చరిక

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. పార్టీని 2014లో అధికారంలోకి తీసుకు రావడమే మా ఇరువురి ఆశయమే అన్నారు. సీనియర్ నేతలను గౌరవిస్తూ వారి సూచనల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ సమైక్యంగా ఉన్నప్పుడు ఎవరూ దెబ్బ తీయలేరన్నారు. గతంలో విభేదాల కారణంగానే నష్టపోయిందన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. పార్టీలో కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తల వల్లే తమకు అధికారం వచ్చిందన్నారు. అలాంటి కార్యకర్తలను కాంగ్రెసు ఎప్పుడూ మరిచిపోదన్నారు. కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు.