తెలంగాణ కోరుకుంటున్నారు: జైపాల్ వ్యాఖ్యలతో విభేదించిన కెకె

కాంగ్రెసు పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం అన్నారు. పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే అన్నారని గుర్తు చేశారు. తనది ప్రాంతీయ వాదం కాదని జాతీయ వాదం అన్న జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. బిజెపిని దృష్టిలో పెట్టుకునే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేశారు. ప్రాంతాలు వేరైనా అందరం అన్నదమ్ములమే అని అన్నారు.
కాగా జైపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి విపరీతార్థాలు తీయవద్దని ఎంపీ పొన్నం ప్రభాకర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. అయి బిజెపిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. జాతీయ భావం అందరికీ ఉండాల్సిందే అన్నారు. జాతీయభావం ఉన్నంత మాత్రాన ప్రాంతీయభావం ఉండకూడదని లేదన్నారు.