వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లండన్ శివార్లలోని శ్మశానవాటికలో హుస్సేన్‌కు అంతిమ వీడ్కోలు

ఈ అంత్యక్రియల్లో ఆయన నలుగురు కుమారులు షాఫద్, షంషాద్, ముస్తఫా, ఒవైస్‌లతోపాటు ఇద్దరు కుమార్తెలు అకీలా, రైసా పాల్గొన్నారు. బ్రిటన్‌లోని భారత రాయబారి నళిన్ సూరి, ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్, హిందూజా గ్రూప్ వైస్ చైర్మన్ జి.పి.హిందూజా, బ్రిటన్‌లోని భారతీయ విద్యా భవన్ చైర్మన్ జోగిందర్ సంగార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు ప్రజల సందర్శనార్థం హుస్సేన్ పార్థివ శరీరాన్ని టూటింగ్‌లోని ఇదారే జఫేరియా వద్ద ఉంచి నమాజే జనాజా నిర్వహించారు. గత కొన్ని నెలలుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న 95 ఏళ్ల హుస్సేన్ గురువారం లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్ ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.