ఎమ్మెల్యేలు పగలు సిఎంతో, రాత్రి జగన్‌తో సంసారం: నారాయణ
Districts
oi-Srinivas G
By Srinivas
|
అనంతపురం: కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కొందరు పగలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, రాత్రి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సంసారం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శనివారం అనంతపురం జిల్లాలో విమర్శించారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలకు నార్కో అనాలసిస్ నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రైతాంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మిల్లర్లతో కుమ్మక్కు అయిన ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై వచ్చే సమావేశాలలో తాము అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవాలని సవాల్ విసిరారు. తెలంగాణ అంశాన్ని కేంద్రం జఠిలం చేసిందని అభిప్రాయపడ్డారు.