జగన్ పక్కదారి పట్టాడు, వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకోండి: పొంగులేటి

2014 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బొత్స, కిరణ్ పని చేస్తారని తాను భావిస్తున్నట్టు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరూ సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించాలని కోరారు. మాజీ సారథి డి శ్రీనివాస్ సేవలు ఆమోఘం అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. కాగా సోనియాను గౌరవించని వారు పార్టీలో నుండి బయటకు వెళ్లి పోవాలని ఏఐసిసి నేత కెబి కృష్ణమూర్తి సూచించారు.
పార్టీలో పుట్టి పార్టీని విమర్శించే వారిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. ఈ సమావేశం నుండే పార్టీని విమర్శించే వారికి హెచ్చరికలు పంపుతున్నట్లు చెప్పారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమంగా కనిపిస్తోందన్నారు. కార్యకర్తల ఉత్సాహంగా ఉంటేనే పార్టీ మనుగడ చెందుతుందన్నారు.