తెలుగుదేశం పార్టీ నేతల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారు: నాగం

తెలంగాణపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాల్సిందేనని, తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి చిదంబరానికి చంద్రబాబు లేఖ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. సీమాంధ్ర కుట్రలో భాగంగానే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుల మధ్య ద్వేషాలు పెంచారని ఆయన అన్నారు. తెలంగాణపై తమ లక్ష్యం కాంగ్రెసు పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధేనని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై కార్యక్రమాలు నిర్వహించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబును ఎన్నోసార్లు కోరానని, అయినా ఫలితం లభించలేదని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ రణభేరుల పేరుతో తెలంగాణ నాయకులను పరుగులు పెట్టిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి సహకారం తీసుకుని రణభేరులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications