వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జూపల్లిపై రుసరుసలాడిన డికె అరుణ, స్వార్థంతోనే పాదయాత్ర అని వ్యాఖ్య

దేవాదాయశాఖను వదిలిపెట్టాలనే ఆలోచనతోనే జూపల్లి మంత్రిపదవికి రాజీనామా చేశారని ఆమె వెల్లడించారు. తన సొంత నియోజకవర్గమైన గద్వాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ యాత్రలో పాల్గొనడం లేదని అరుణ పేర్కొన్నారు. బయటనుంచి వచ్చిన వ్యక్తులు తమ కుటుంబంలోని వ్యక్తిగత విభేదాలతో కొందరు వ్యక్తులు మాత్రమే ఈ యాత్రలో పాల్గొన్నారని ఆమె చెప్పారు. పౌర సరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రాని తెలంగాణ దేవాదాయ శాఖ దక్కగానే గుర్తుకు వచ్చిందా అని ఆమె అడిగారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూపల్లి కృష్ణా రావు కొద్ది రోజులుగా జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. తన నియోజకవర్గం గద్వాలలో జూపల్లి కృష్ణా రావు పాదయాత్ర తలపెట్టడాన్ని డికె అరుణ తీవ్రంగా వ్యతిరేకించారు.