ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై బొత్స సత్యనారాయణ వార్ మొదలు

ప్రతి దానికీ ముఖ్యమంత్రిపై ఆధారపడడం సరి కాదని ఆయన అన్నారు. స్వేచ్ఛగా వ్యవహరించాలని ఆయన ఈ వ్యాఖ్యతో సూచించినట్లు అర్థమవుతోంది. తాను సాయంత్రం మంత్రులతో సమావేశమవుతానని కూడా బొత్స సత్యనారాయణ చెప్పారు. శానససభ్యుల నియోజకవర్గాల్లో వారికి చెప్పకుండా నాయకులు పర్యటించకూడదని, ఇదే విషయం తాను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు చెప్పానని ఆయన అన్నారు. మంత్రులతో మాట్లాడతానని అనడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డిపై ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతోనే బొత్స సత్యనారాయణ ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications