కొండా సురేఖ సాక్షిగా తెలంగాణ విద్యార్థులపై జగన్ కార్యకర్తల దాడి

చెప్పినట్టుగానే కెయు విద్యార్థులు కలెక్టరేట్ వద్దకు చేరుకొని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ జెండాలు తొలగించారు. ఫ్లెక్సీలు చించి వేశారు. ధర్నాను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. జగన్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి విద్యార్థులపై దాడి చేశారు. పలువురు విద్యార్థులపై చేయి చేసుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications