కాంగ్రెసుకు టిడిపి గతే పడుతుంది: వైయస్సార్ పార్టీ నేత రోజా

Roja
చిత్తూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ రైతాంగ సమస్యలను పట్టించుకోకుంటే రైతులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ప్రముఖ సినీ నటి రోజా సోమవారం ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేపట్టిన సాగుపోరు దీక్షలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో రోజా, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పూతలపట్టు శాసనసభ్యుడు రవి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు.

రైతులను పట్టించుకోనందుకు గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ఇప్పుడు కాంగ్రెసుకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులను పట్టించుకోకుంటే టిడిపికి పట్టిన గతే కాంగ్రెసుకు పడుతుందన్నారు. అధికార పార్టీని రైతులు తరిమి తరమి కొడతారని హెచ్చరించారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత రాష్ట్రంలో రైతులను పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి జగన్ రైతాంగ సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. పక్క రాష్ట్రంలో రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నారని కానీ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+