ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు హరికృష్ణ: వర్క్‌షాప్ వేదికపై బావబావమరుది

ఇటీవల చంద్రబాబు తన తనయుడు లోకేష్ కుమార్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. దానికి ప్రతిగా హరికష్ణ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి తీసుకు రావడం జరిగి పోయింది. తద్వారా టిడిపిలో వారసత్వ పోరు అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇటీవల జరిగిన మహానాడులో చంద్రబాబు లోకేష్ రాజకీయ ప్రవేశంపై వెనక్కి తగ్గారు. అయినప్పటికీ హరికృష్ణ తగ్గనట్టు కనిపించారు. మహానాడు రెండో రోజు హాజరైన హరికృష్ణ మధ్యలోనే అలిగి వెళ్లి పోయారు. చంద్రబాబు, హరికృష్ణ మధ్య అసంతృప్తి ప్రత్యక్షంగా బయట పడింది. అయితే టిడిపి వర్క్‌షాప్‌కు హరికృష్ణ హాజరు కావడం ద్వారా తమలో విభేదాలు లేవని చెప్పాలనుకున్నట్టుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications