ఇరాన్ ను పాతికేళ్లు వెనక్కు నెట్టాం.. అంతం చేసే వరకూ వదలం: ట్రంప్ సంచలనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ లోని ప్రముఖ న్యూక్లియర్ కేంద్రం అయిన నతాంజ్ న్యూక్లియర్ సైట్ ను పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడిని ఆపలేదని స్పష్టం చేశారు. ఇరాన్ పై ఎంతలా దాడి చేశామో అక్కడి ప్రజలు, నాయకులకు మాత్రమే తెలుసని మిగతా వారికి తెలియదని ట్రంప్ అన్నారు. ఈ దాడులతో ఇరాన్ కోల్పోయిదాన్ని పొందడానికి మరో 20 నుంచి 25 ఏళ్లు పడుతుందని అన్నారు. అయితే మేము రేపే ఇరాన్ నుంచి వెళ్లిపోయినా అది తమకు పెద్ద విజయమే అని అన్నారు. కానీ తాము ఇరాన్ అంతు చూసేవరకూ వెనకడుగు వేయమని తెలిపారు.
ఇక ఇరాన్- అమెరికా మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) స్పష్టం చేసింది. ఈ రెండు దేశాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పైనా క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొంది. మరోవైపు గత పది రోజులుగా ఇరాన్ లోని అనేక ప్రాంతాలు, స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ(IRNA) అందించిన సమాచారం ప్రకారం.. బహ్రెయిన్ లోని రాడార్ ఇన్ స్టాలేషన్ అమర్చిన రెండు అవుట్ పోస్టుల్లో అలాగే రెండు ఎయిర్ సిస్టమ్స్ పై దాడులకు పాల్పడింది. ఇక కువైట్ లోని మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్లు, శాటిలైట్ రిసెప్షన్ సిస్టమ్స్ పై ఇరాన్ సైన్యం దాడులు చేసి ధ్వంసం చేసింది. దాంతో బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా స్థావరాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్.
🇺🇸🇮🇷 Trump on the damage done to Iran.
— Mario Nawfal (@MarioNawfal) July 21, 2026
"Now, nobody knows except the Iranians the damage that we've done to them.
We have done damage that will take them 20, 25 years to recover from.
So if we left tomorrow, we had a big, we had a big success, but we're not leaving tomorrow."…
అమెరికా భాగస్వామ్య దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఆయా దేశాల్లోని పౌరుల మౌలిక సదుపాయాలే టార్గెట్ గా విరుచుకుపడుతోంది. తమ దేశంపైకి ఇరాన్ ప్రయోగించిన ఐదు డ్రోన్ లు, మూడు క్షిపణులను సమర్థవంతంగా కూల్చేసినట్లు జోర్డాన్ ఆర్మీ పేర్కొంది. అలాగే కువైట్ లోని డీసాలినేషన్, పవర్ ప్లాంట్స్ పై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు కువైట్ లోని ఎలక్ట్రిసిటీ, వాటర్, రిన్యూవెబుల్ ఎనర్జీ మినిస్ట్రీ స్పష్టం చేసింది. కువైట్ లోని ఈ ప్లాంట్స్ పై గత నాలుగు రోజులుగా దాడులు జరుగుతూనే ఉన్నాయని పేర్కొంది.
మరోవైపు ఇరాన్ పై అమెరికా దాడులు ఉద్ధృతం చేస్తోంది. పది రోజులుగా ఇరాన్ పై అమెరికా సైన్యం దాడులకు పాల్పడుతోంది. టెహ్రాన్ మిలిటరీ సామర్థ్యాలను బలహీనపరచడమే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడుతోంది. అమెరికన్ సర్వీస్ మెంబర్ మృతితో తాజాగా మరోసారి ఇరాన్ పై అమెరికా సైన్యం దాడులు చేసింది. హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోందని.. ఆ దాడులను తగ్గించేందుకు తాము ఇరాన్ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నట్లు తెలిపింది.

ఓ పక్క యుద్ధం భీకరంగా సాగుతున్నా మరోవైపు ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ ఇంటీరియర్ మినిస్టర్ ఎస్కందర్ మొమేనీ పాకిస్థాన్ కు చేరుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ లతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications