జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు చంద్రమంగళ యోగంతో వీరికి మహారాజయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాలు ఒకరాశి నుండి మరొక రాశిలోకి మారుతూ , వేరే గ్రహాలతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా, మరికొన్ని అశుభ యోగాలు.

జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు చంద్రమంగళ యోగం

జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు అత్యంత ముఖ్యమైన చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో కుజుడు వృశ్చిక రాశి లోని సంచరించడం వల్ల రెండు గ్రహాల మధ్య పరస్పర వీక్షణ ఏర్పడి చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది.

Chandra Mangal Yoga from July 24 to 26 2026 brings wealth income growth to these zodiac signs

వృషభ రాశి

వృషభ రాశి వారికి చంద్రమంగళ యోగంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఈ సమయంలో పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వడ్డీ వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారం చేసేవారికి ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు చంద్రమంగళ యోగం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. తండ్రి వైపు నుంచి కలిసి వస్తుంది. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. షేర్ మార్కెట్ ద్వారా లాభాలు వస్తాయి. అదనపు ఆదాయం వస్తుంది. ఇల్లు, భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి అకస్మాత్తుగా ధన లాభాలు వస్తాయి. జీతం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. తోబుట్టువులతో ఆస్తి సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇది వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన సమయం.

మకర రాశి

మకర రాశిలో లాభ స్థానంలో ఏర్పడే చంద్రమంగళ యోగం వీరికి కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది. సొంత ఇల్లు కొనుగోలు చేయవచ్చు. షేర్లలో పెట్టుబడులు పెట్టడం, భూమి కొనుగోలు జరగవచ్చు.

మీన రాశి

మీన రాశిలో భాగ్య స్థానంలో ఏర్పడే చంద్ర మంగళ యోగం కారణంగా మీనరాశి వారి ఆర్ధిక ప్రయత్నాలు సఫలం అవుతాయి . రహస్య ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆస్థి వివాదాల పరిష్కారం అవుతుంది. స్థలాల కొనుగోలుకు అవకాశం ఉంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+