వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలను అవమానించిన చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ‌: కట్టకట్టుకుని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వద్దకు వెళ్లిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు అవమానమే ఎదురైంది. పట్టుమని ఇరవై నిమిషాలు కూడా ఆయన వారికి సమయం ఇవ్వలేదు. ఈ భేటీపై తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తిన్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని చిదంబరం వారికి చెప్పారు. రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.

తాను పార్టీ వ్యక్తినైనా మంత్రిగా ఉన్నాను కాబట్టి ఇక్కడ కూర్చున్నానని, అందరి అభిప్రాయాలూ తీసుకున్నానని, ఈ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలియజేస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ పరంగా తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. యుపిఎ, కాంగ్రెసు పార్టీల నిర్ణయాలను బట్టే తెలంగాణపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని, ప్రభుత్వ పరంగా తెలంగాణపై తీసుకున్న చర్యలను పార్లమెంటుకు తెలియజేస్తామని ఆయన అన్నారు. తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడాల్సి ఉందని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు చిదంబరంతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కాంగ్రెసుకు తమిళనాడులో పరిస్థితే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడుతుందని వారు చెప్పారు. చిదంబరంతో జరిగిన భేటీలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పది మంది మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, దామోదర రాజనర్సింహ, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ఈ భేటీలో లేరు.

English summary
It is learnt that Union Home minister P Chidambaram has insulted Congress Telangana region public representatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X