విద్యార్థుల ప్రాణాలతో టిఆర్ఎస్ బలం పెంచుకుంటోంది: కొండా సురేఖ
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి పార్టీ బలాన్ని పెంచుకుంటోందని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖ బుధవారం ఆరోపించారు. టిఆర్ఎస్ జెండా పట్టుకొని జై తెలంగాణ అంటేనే తెలంగాణ వాది కాదని ఆమె అన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి తన ఇంటిమీదకు పంపిన టిఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థులు కూడా టిఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చి పోవద్దని కోరారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయింది విద్యార్థులు, సామాన్యులే కానీ నాయకులు గానీ, నాయకులు కుటుంబ సభ్యులు కానీ ప్రాణాలు కోల్పోలేదన్నారు.
టిఆర్ఎస్ తెలంగాణలో ఉనికిని కోల్పోతుంది కాబట్టే పరోక్ష దాడులకు పాల్పడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి తాను ఉద్యమానికి మద్దతు పలుకుతున్నానని చెప్పారు. తాను తన నియోజకవర్గంలో టిఆర్ఎస్ పైనే గెలుపొందినట్లు చెప్పారు. తనకు ప్రజల మద్దతు ఉందన్నారు. తాను ఎవరికీ భయపడేది లేదన్నారు. తెలంగాణ విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. తెలంగాణపై జగన్‌తో స్పష్టమైన వైఖరిని ప్రకటింపజేసిన తర్వాతనే ప్రజల్లోకి వెళతామని చెప్పారు. తనపై కాంగ్రెసు పార్టీ అనర్హత వేటు వేసినా కూడా తాను మళ్లీ తన నియోజకవర్గం నుండి గెలుస్తానని చెప్పారు.
Parakal MLA Konda Surekha blamed Telangana Rastra Samithi for students suicide in Telangana. She confirmed that she will win in election if party will take action.
Story first published: Wednesday, June 15, 2011, 16:20 [IST]