స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను తన్నిన ఎద్దు, స్వల్పగాయాలు

కార్యక్రమానికి వచ్చిన నాదెండ్ల నడుస్తున్న సమయంలో దగ్గరలో ఉన్న ఎద్దు ఒకటి చుట్టూ భారీగా వచ్చిన జనాలను చూసి బెదిరిపోయింది. దీంతో అది పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్‌ను తన్నింది. దీంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. కాగా నాదెండ్లను ఎద్దు తన్నింది అని తెలియడంతో హైదరాబాదులోని ముఖ్యమంత్రి, స్పీకరు కార్యాలయం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నాదెండ్లకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగారు. అయితే ఆయనకు ఏమీ కాలేదని స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని ఎలాంటి ఆందోళన అవసరం లేదని మాణిక్యవరప్రసాద్ వారికి చెప్పారు.












Click it and Unblock the Notifications