అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ సిఎం కావాలనుకున్నాను: మంత్రి రఘువీరారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని తాను, తనతో పాటు పలువురు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అనుకున్నారని మంత్రి రఘువీరారెడ్డి బుధవారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం కాంగ్రెసులోని 154 మంది ఎమ్మెల్యేలు కూడా అదే కోరుకున్నారని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు తనకు జగన్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు సిఎంగా చూడాలని అనుకున్నప్పటికీ పార్టీని వీడిన తర్వాత ఆలాంటి ఆలోచన లేదన్నారు. పార్టీలో ఉంటూ ఆయనకు సహకరించే నేతలను పార్టీ ద్రోహులుగానే గుర్తిస్తామని చెప్పారు.

కాగా బుధవారం అనంతపురం జిల్లాలో మంత్రి రఘువీరారెడ్డి పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వర్గం, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు పాల్గొనలేదు.

English summary
Minister Raghuveera Reddy said today that he was hoped that he want to see YS Jaganmohan Reddy as chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X